ప్లాప్ సినిమాతో రికార్డు కొట్టిన నితిన్!
యంగ్ హీరో నితిన్ నటించిన లై చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం చెందింది. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలం చెందింది. అయినప్పటికీ లై చిత్రం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
లై హిందీలో కూడా డబ్ అయింది. యూట్యూబ్ లో ఈ చిత్రానికి 50 మిళియన్లకు పైగా వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మించారు.

ఈ చిత్రంలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. ప్రతినాయకుడిగా అర్జున్ నటించారు. నితిన్ ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆగస్టులో ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











