ఇరువురు భామలతో లవర్ బాయ్ సిద్ధార్థ్ '180'

By Sindhu

సిద్ధార్థ్ ఇద్దరు భామలతో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి '180' అని పేరు పెట్టారు. నిత్య మీనన్, ప్రియా ఆనంద్ సిద్ధార్థ్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఎస్పీఎల్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, అగల్ ఫిలిమ్స్ పతాకం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సిద్ధార్థ్ గురువు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ... 'ఈ చిత్రం షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. దర్శకుడు మా కుటుంబ స్నేహితుడు. చిన్నతనంలో అంటే... పదేళ్ల వయస్సులో నన్ను ఓ యాడ్ ఫిలిమ్‌కు డబ్బింగ్ చెప్పమన్నారు.

బానిస్ అనే మస్కిటో కాయల్‌లో ఓ బాంబే కుర్రాడు నటించాడు. వాళ్ల అమ్మను 'ఇది ఏమిటి..?' అని అడుగుతాడు. నేను ఆ పాత్రకు 8 భాషల్లో డబ్బింగ్ చెప్పాను. అప్పుడు నాకు 300 రూపాయలిచ్చారు. అటువంటి గురువుగారి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందన్నాడు సిద్ధార్థ్.

ఈ సినిమాను డిసెంబరులో పూర్తి చేసి వచ్చే వేసవికాలంలో విడుదల చేస్తామని చెప్పాడు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఈ కథ ఉంటుందన్నాడు. ఈ చిత్రానికి కెమేరా: బాలబ్రహ్మన్, మాటలు: ఉమర్జీ కుమరన్, కథ - స్క్రీన్ ప్లే: శుభ, జయేంద్ర, దర్శకత్వం: జయేంద్ర

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X