'రాజా రాణి' హీరోయిన్ పెళ్లి మిస్టరీ వీడింది.. నా వల్లే.. నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Recommended Video
ఇటీవల నిత్యామీనన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్రలో ఛాన్స్ దక్కించుకుందంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు తన సొంత ఇండస్ట్రీ మలయాళీ చిత్ర పరిశ్రమలో నిత్యామీనన్ పై వ్యతిరేకత మొదలైంది. మలయాళీ నిర్మాతలు నిత్యామీనన్ పై బ్యాన్ విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై నిత్యామీనన్ వివరణ ఇచ్చింది కూడా. తాజాగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజా రాణి ఫేమ్ నజ్రియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నజ్రియా ప్రేమ వివాహం
హీరోయిన్ నజ్రియా తెలుగులో నటించలేదు కానీ. ఆమె నటించిన రాజా రాణి చిత్రంతో తెలుగువారికి కూడా దగ్గరైంది. తమిళ మలయాళీ చిత్రాలు అవకాశాలు దక్కుతున్న సమయంలోనే ప్రముఖ నటుడు ఫాహత్ ఫాజిల్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. 2014లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత నజ్రియా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం రీ ఎంట్రీకి కూడా సిద్ధం అవుతోంది. నజ్రియా నటిస్తున్న రెండు మలయాళీ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా నిత్యామీనన్ మాట్లాడుతూ నజ్రియా పెళ్లి రహస్యాన్ని బయటపెట్టింది.

నా వల్లే పెళ్లి
మలయాళీ చిత్రం బెంగుళూరు డేస్ 2014లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, ఫాహత్ ఫాజిల్, నవీన్ పౌలి, నజ్రియా, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. మొదట ఈ చిత్రంలో నిత్యామీనన్ కు నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో నిత్యామీనన్ బిజీగా ఉండడం వలన బెంగుళూరు డేస్ చిత్రాన్ని వదులుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాతే నజ్రియాకు ఛాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నజ్రియా, ఫాహత్ ఫాజిల్ మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమ, పెళ్ళికి దారితీశాయని నిత్యామీనన్ తెలిపింది.

వారిద్దరూ ఇదే విషయాన్ని
నజ్రియా, ఫాహత్ ఎదురైనపుడల్లా నాతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. నీ వల్లే మా ఇద్దరి పెళ్లి జరిగిందని చెబుతుంటారు. షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ సినిమా విడుదలయ్యేలోపే పెళ్లి కూడా చేసేసుకున్నారని నిత్యామీనన్ తెలిపింది. అలా తాను నజ్రియా వివాహానికి కారణం అయ్యానని నిత్యామీనన్ చెబుతోంది. నిత్యామీనన్ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

ఎన్టీఆర్‌కు జోడిగా
ఇదిలా ఉండగా నిత్యామీనన్ RRR చిత్రంలో గిరిజన యువతి పాత్రలో నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. నిత్య మీనన్ ఎన్టీఆర్ ని ప్రేమించే వ్యక్తిగా కనిపిస్తుందట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకోడవంతో రాజమౌళి ఎన్టీఆర్ సరసన నటించే మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. త్వరలో RRR చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతోంది.


Click it and Unblock the Notifications











