For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంగిత జ్ఞానం ఉండదా? ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యా.. నిత్య మీనన్ ఫైర్

  |

  దక్షిణాదిలో తన ప్రతిభతో సత్తా చాటిన హీరోయిన్ నిత్యా మీనన్ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమయ్యారు. దక్షిణాది చిత్రాలను ఆచీతూచీ చేస్తున్న నిత్య మీనన్ దాదాపు తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. పలు భారీ బడ్జెట్ సినిమాలను, ప్రముఖ హీరోలతో సినిమాను వదిలేయడంతో ఆమె పరిశ్రమకు దూరమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తన కెరీర్, ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ..

  దక్షిణాదిలో తన టాలెంట్‌తో

  దక్షిణాదిలో తన టాలెంట్‌తో

  నిత్యా మీనన్ అలా మొదలైందితో ప్రయాణాన్ని మొదలుపెట్టి గుండె జారి గల్లంతమైందే, ఇష్క్, జనతా గ్యారేజ్, ఒకే బంగారం లాంటి దక్షిణాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించింది. తాజాగా బాలీవుడ్‌లో మిషన్ మంగళ్ చిత్రంతో అడుగుపెట్టి అక్కడ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.

  డిజిటల్ మీడియంలోకి అడుగు పెడుతూ

  డిజిటల్ మీడియంలోకి అడుగు పెడుతూ

  ఇప్పుడు హిందీ ప్రేక్షకులతోపాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు వెబ్ సిరీస్‌తో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిషేక్ బచ్చన్‌తో కలిసి బ్రీత్: ఇంటూ ది షాడో అనే చిత్రంలో నటించార. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ప్రసారం కానున్నది. అయితే తెలుగు, తమిళ సినిమాలకు దూరం కావడానికి తన బరువు సమస్యే అని నిత్య మీనన్ చెప్పారు.

  బాడీ షేమింగ్ కామెంట్లతో

  బాడీ షేమింగ్ కామెంట్లతో

  ఇటీవల ఓ వెబ్‌పోర్టల్ తాను బరువు పెరగడం, లావు కావడంపై ప్రచురించిన కథనంతో నేను చాలా హర్ట్ అయ్యాను. బరువు పెరగడం అనేది మహిళలు బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. కేవలం మనిషి కొనసాగించే జీవన విధానం, లైఫ్‌స్టైల్ బరువు పెరగడానికి కారణం కాదని చాలా మంది తెలుసుకోవాలి. ఎవరైనా బరువు పెరిగితో చాలా అనవసరపు విషయాలను ముడిపెట్టి చెత్తగా మాట్లాడుతారు అని నిత్య మీన్ అభిప్రాయపడ్డారు.

  ఆకారం, రూపం గురించి మాట్లాడటం

  ఆకారం, రూపం గురించి మాట్లాడటం

  ఎవరికో ఇంటర్య్వూ ఇవ్వడం లేదనో లేక వ్యక్తిగత కారణాలను దృష్టిలోపెట్టుకొని బాడీ షేమింగ్ చేయవద్దు. ఒక వ్యక్తి ఆకారం, రూపం అనేది వారి చేతుల్లో ఉండదు. దేవుడు ఇచ్చినట్టు ఉంటుంది. జీవితం మధ్యలో అనేక శారీరక మార్పుల వల్ల, హార్మోన్ల లోపం వల్ల బాడీలో మార్పులు జరుగుతాయనే కనీసం తెలియని వాళ్లు కూడా ఉన్నారని నిత్య మీనన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  IFFI 2019 : Rashmika Mandanna About How She Deal With Trolls
  అదృశ్యమైన బిడ్డకు తల్లిగా

  అదృశ్యమైన బిడ్డకు తల్లిగా

  వెబ్ సిరీస్‌లోకి ప్రవేశించడంపై నిత్య మీనన్ వివరణ ఇస్తూ.. తనకు పాత్ర నచ్చడం వల్లే నేను నటించాను. అదృశ్యమైన బిడ్డ కోసం తపన, ఆవేదన పడే ఓ తల్లి పాత్రను పోషించాను. పాత్ర పరంగా నాకు మంచి సంతృప్తి లభించింది. అభిషేక్ కపూర్ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. జూలై 10న ఓటీటీలో ప్రసారం కానున్నది అని నిత్య మీనన్ చెప్పారు.

  English summary
  South Star Nithya Menen is making foray into digital medium with Breathe web series, which acted by Abhishek Bachchan. She felt serious over serious about body shaming comments on her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X