twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతిగా తిని కొవ్వెక్కారని ట్రోలింగ్ చేస్తారా? లావు వెనుక మా బాధలు తెలుసా? నిత్యా మీనన్ ఫైర్

    |

    Recommended Video

    Nithya Menen Seriously Reacted On Trolling About Body Shaming || Filmibeat

    అందం, అభినయంతో లక్షలాది అభిమానులను సంపాదించుకొన్న నిత్య మీనన్ ఇటీవల కాలంలో విపరీతంగా లావెక్కడం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. తాను లావుగా మారిపోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్‌తో విపరీతంగా ఇబ్బంది పెట్టారు. నీ సోమరితనం వల్లనే నీవు లావెక్కావంటూ మానసికంగా హింసించారు. తన బరువు పెరిగిపోవడంపై నిత్యా మీనన్ పెదవి విప్పారు. తన బాధను మీడియాతో పంచుకొన్నారు. ఇంతకు నిత్య మీనన్ బరువు పెరగడానికి కారణమేమిటంటే..

    తిని ఎంజాయ్ చేస్తారని అనుకొంటారా?

    తిని ఎంజాయ్ చేస్తారని అనుకొంటారా?

    నేను లావుగా మారిపోవడాన్ని టార్గెట్ చేసుకొని నన్ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. మేమేదో కూర్చొని.. తింటు ఎంజాయ్ చేస్తామని అనుకొంటారు. కానీ మహిళలు లావు కావడానికి రకరకాల కారణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. సోమరితనం, అతిగా తినడం కారణంగానే లావెక్కామని అనుకోవడం తప్పు అని నిత్య మీనన్ అన్నారు.

    బరువు పెరగడానికి రకరకాలుగా

    బరువు పెరగడానికి రకరకాలుగా

    సాధారణంగా నాకే కాదు.. మహిళలందరికీ ఈ సమస్య ఉంటుంది. హార్మోన్ల లోపం వల్ల చాలా మంది బరువు పెరిగి లావు అవుతారు. అలా సమస్య రావడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. మానసికంగా అది ఎంత భాద అనేది అర్ధం కాదు. కొన్నిసార్లు ఎంత బాధకు గురి చేస్తుందో చెప్పినా వారికి అవగాహన కలుగదు అని నిత్యా మీనన్ ఎమోషనల్ అయ్యారు.

    సోమరితనం వల్ల కాదు

    సోమరితనం వల్ల కాదు

    లావు, బరువు పెరిగిపోవడంపై ప్రతీ ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. బరువు పెరిగిపోవడం తినడం, సోమరితనం వల్ల వచ్చే సమస్య కాదు. అలా ఓ రకంగా ఇబ్బంది పడుతుంటే ట్రోల్స్ మరింత కుంగదీస్తాయి. చాలా సార్లు నేను అప్‌సెట్ అయ్యాను. నాకు సినిమా ఒక్కటే జీవితం. దానిని తప్ప మరోటి ఊహించుకోలేను. అలాంటప్పుడు నా శరీరాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకోలేక ఉంటాను చెప్పండి అంటూ నిత్య మీనన్ ఎమోషనల్ అయ్యారు.

     బాలతారగా సినీ పరిశ్రమలోకి

    బాలతారగా సినీ పరిశ్రమలోకి

    దక్షిణాదిలో ప్రతిభవంతురాలిగా పేరు తెచ్చుకొన్న నిత్య మీనన్ బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. భారతీయ ఆంగ్ల చిత్రం ది మంకీ హూ న్యూ టూ మచ్ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర రంగంలో అద్భుతంగా రాణించింది.

     హిందీలో రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌తో

    హిందీలో రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌తో

    తాజాగా నిత్య మీనన్ హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మిషన్ మంగళ్ చిత్రం ద్వారా హిందీ సినీ ప్రేక్షకులకు చేరువైంది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మలయాళంలో కొలంబి అనే సినిమాలోను. అలాగే తమిళంలో జయలలిత బయోపిక్‌లో, మిస్కన్ దర్శకత్వంలో సైకో సినిమాలో నటిస్తున్నది. సైకా చిత్రం లీగల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది.

    English summary
    Nithya Menen seriously reacted on trolling and body shaming. She said sometimes its affects her. She said, I want to say that one faces weight issues very rarely because of being lazy and eating. Trust me, especially in the case of actors, we are not lazy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X