నిత్యామీనన్ ..బాలీవుడ్ ఎంట్రీ ఖరారు
ఇక ఈ చిత్రానికి మలయాళంలో విజయం సాధించిన '22 ఫిమేల్ కోట్టయం' మాతృక. సీనియర్ నటుడు నరేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.నటి జయభారతి కుమారుడు క్రిష్ హీరో. కోటా శ్రీనివాసరావు, నరేష్, కోవై సరళ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మళయాళంలో మాదిరే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యమీనన్ మాట్లాడుతూ.. ప్రారంభంలో కథ చెప్పినప్పుడు నటించేందుకు భయపడ్డా. ఆ పాత్ర చాలా కఠినమైనది. పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనేమోనన్న భయం కలిగింది. శ్రీప్రియ ధైర్యం చెప్పారు. ఆ తర్వాతే ఒప్పుకున్నానని తెలిపింది. తన కెరీర్‌లో ఇదివరకు చేయని పాత్రలో నటిస్తున్నానని నరేష్ చెప్పారు.
దర్శకురాలు మాట్లాడుతూ.. 19 ఏళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్ కుర్చీలో కూర్చున్నా. నా భర్త రాజ్‌కుమార్ సినిమాను నిర్మిస్తున్నారు. నిత్యమీనన్ కథానాయిక. నటి జయభారతి కుమారుడు క్రిష్ కథానాయకుడు. కోటా శ్రీనివాసరావు, నరేష్, కోవై సరళ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. అరవింద్-శంకర్ సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications












