నేను అలాంటిదాన్ని కాదు : నిత్యా మీనన్
హైదరాబాద్ :'' హిట్ చూపించి డబ్బులు సంపాదించుకోవాలని నేను అనుకోవడం లేదు. కథ, పాత్ర నచ్చితేనే సినిమా చేస్తాను. అలా సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా ఫర్వాలేదు. ఇది నేనేదో ఇప్పుడు చెప్పిన మాట కాదు. చాలా కాలం నుంచి నేను అంటోన్నదే కదా'' అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్. తనకు డబ్బు కక్కుర్తి లేదని ఖచ్చితంగా చెప్పింది.
సాధారణంగా హిట్స్ జోరుమీదున్నప్పుడే వరుస సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తారు. కానీ దీనికి నేను విరుద్ధం అంటోంది నిత్య మీనన్. 'గుండెజారి గల్లంతయ్యిందే' తర్వాత ఈ భామ తెలుగులో అంగీకరించిన సినిమా మరొకటి లేదు. అప్పటికే అంగీకరించిన 'ఏమిటో ఈ మాయ' ఒక్కటే షూటింగ్ జరుపుకొంటోంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో మూడు తమిళ, ఒక మలయాళ సినిమా ఉన్నాయి.
మలయాళ సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలోనూ నిత్య నటిస్తోంది. తమిళంలో '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో రూపొందుతోంది. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తోంది. నిత్యామీనన్ కి తెలుగులోనూ మార్కెట్ ఉన్న దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ 22 Female Kottayam చిత్రం వర్మ రూపొందించిన ఏక్ హసీనా థీ చిత్రం ప్రేరణతో తయారైంది.
ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ఇటీవల నితిన్‌తో గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో హిట్ కొట్టిన నిత్యా...ప్రస్తుతం 'ఏమిటో ఈ మాయ' చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది.


Click it and Unblock the Notifications












