నిత్యా మీనన్ సరదాకు ఏయిరిండియా ఫైలట్లు బలి!
హైదరాబాద్ : హీరోయిన్ నిత్యా మీనన్ తన సరదా తీర్చుకోవడానికి చేసిన పనికి ఏయిర్ ఇండియా ఫైలట్లు ఇద్దరు బలయ్యారు. ఇటీవల నిత్యా మీనన్ హైదరాబాద్ నుండి బెంగుళూరుకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో ప్రయాణం చేసింది. అయితే ప్యాసింజర్ సీట్లో బుద్దిగా కూర్చోవాల్సిన నిత్యా మీనన్....ఫైలట్ గదిలో కూర్చోవాలని సరదా పడింది.
అందమైన హీరోయిన్ స్వయంగా కోరడంతో కాదనలేక పోయిన ఫైలట్లు ఆమెను తమ కాక్ పిట్ (ఫైలట్లు విమానం కంట్రోల్ చేసే గది)లోకి ఆహ్వానించారు. అంతా బాగానే ఉంది కానీ ఈ వ్యవహారం గమనించిన ఓ ప్రయాణీకుడు ఎయిర్ పోర్టులో దిగాక ఈ విషయమై కంప్లైంట్ చేసాడు.
విమానాన్ని కంట్రోల్ చేసే కాక్ పిట్‌లోకి ఇతరులను అనుమతించడం ఏమిటి? ఏదైనా జరుగరానిది జరిగితే పరిస్థితి ఏమిటి? అంటూ సదరు ప్రయాణీకుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మేనేజ్ మెంట్ ఆ ఇద్దరు ఫైలట్లను పిలిచి క్లాస్ పీకడంతో పాటు వారిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో నిత్యా మీనన్ చాలా పిలిపి పనులు చేస్తూ హీరోను ఆట పట్టించడం చూస్తూనే ఉన్నాం. అయితే నిజజీవితంలోనూ ఆమె ప్రవర్తన ఇలానే ఉంటుందా? అని అనుమాన పడేలా తాజా సంఘటన ఉండటం గమనార్హం. సస్పెండ్ అయిన ఫైలట్లకు నిత్యా మీనన్ వ్యవహారంతో కనువిప్పు కలిగినట్లయింది.


Click it and Unblock the Notifications












