జయలలిత పాత్రకు నేనే పర్ఫెక్ట్.. కంగనాపై పడ్డ నిత్యా మీనన్

తమిళ సినీ, రాజకీయ సంచలనం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులోంచి మొదటగా బాలీవుడ్ క్వీన్ కంగనా నటిస్తోన్న తలైవి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇక దాని గురించి ఏ రేంజ్‌లో ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐరన్ లేడీ అంటూ జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటించేందుకు కూడా బాగానే కసరత్తులు చేస్తోంది. రమ్యకృష్ణ కూడా అమ్మ పాత్రలో నటించనుంది. అయితే అన్నింటి కంటే ముందుగా తలైవి మూవీ నుంచి కంగనా లుక్ రావడంతో అందరి దృష్టి దానిపై పడింది.

మేకప్‌కు బడ్జెట్ మొత్తం..

మేకప్‌కు బడ్జెట్ మొత్తం..

తలైవి లుక్ వచ్చీ రాగానే.. ట్రోలర్స్‌కు పని చెప్పినట్టైంది. తలైవిగా కంగనా లుక్స్‌పై వచ్చినన్ని ట్రోలింగ్స్ ఈ మధ్య కాలంలో మరే చిత్రంపై రాలేదు. యంగ్ జయలలితగా కంగనా సెట్ అయినా.. రాజకీయాల్లోకి వచ్చి అమ్మగా కీర్తించే స్థాయికి ఎదిగిన జయలలిత పాత్రకు ఏమాత్రం సూట్ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెకు, జయలలితకు ఏ సంబంధం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఆ మూవీ బడ్జెట్ అంతా ప్రోస్థటిక్ మేకప్‌కే ఖర్చు అయి ఉంటుందని కౌంటర్లు వేస్తున్నారు.

తలైవీనా..? సత్యభామనా..?

తలైవీనా..? సత్యభామనా..?

కమల్ హాసన్ లేడీ గెటప్ వేసిన భామనే సత్యభామనే చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో కమల్ లుక్‌తో కంగనా తలైవి లుక్‌ను పోలుస్తున్నారు. ఆమె కంటె కమల్ లుక్ బాగుందనే కామెంట్లు పెడుతున్నారు. పిల్లలు చూసే చోటా భీమ్ అనే కార్టూన్ కార్యక్రమంలోని క్యారెక్టర్‌లా కంగనా ఫస్ట్ లుక్‌ ఉందని తెగ సెటైర్లు వేస్తున్నారు.

ట్వీట్లతో హల్ చల్..

ట్వీట్లతో హల్ చల్..

ఈ టీజర్, ఫస్ట్ లుక్‌ను చూస్తే జయలలితకు కూడా కోపం వస్తుందని, ఆమె జయలలితలా లేదని కనీసం కంగనా అని కూడా గుర్తు పట్టలేకపోతున్నానని, ఆలు గడ్డకు కోపం వస్తే ఉండే మొహంలా ఉందని ఇలా పలురకాలుగా ట్వీట్లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. తలైవి ఫస్ట్ లుక్‌పైనే ఇంతగా ట్రోల్స్ నడుస్తూ ఉంటే.. సినిమా విడుదలయ్యాక ఇంకే రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
తాను మాత్రమే పర్ఫెక్ట్..

తాను మాత్రమే పర్ఫెక్ట్..

ఐరన్ లేడీ చిత్రంలో జయలలితగా చేస్తున్న నిత్యా మీనన్ తలైవి ఫస్ట్ లుక్‌పై స్పందిస్తూ.. ఆమె పాత్రకు తానే పర్ఫెక్ట్ అని కామెంట్ చేసింది. ఇక్కడ మిగతా రమ్య కృష్ణ, కంగనా పేరు ఆమె ప్రస్తావించనప్పటికీ వారిని ఉద్దేశించే కామెంట్ చేసిందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ విషయంల కంగనాకు, మరియు ఆమె అక్క రంగోలి కి చేరితే నిత్యా పరిస్థితి ఏమిటో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X