అతను నా లవర్ కాదు.. అజ్ఞాతవాసి ఎవరంటే.. అఫైర్‌ గురించి నిత్యమీనన్ క్లారిటీ

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొనే తారల్లో నిత్యామీనన్ ఒకరు. పాత్ర ఎలాంటిదైనా తన మార్కు నటనతో ఆడియెన్స్ అనుభూతిని పంచడం ఆమె స్పెషాలిటీ. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నిత్యామీనన్ గురించి ఓ వార్త మీడియాలో హల్ చేసింది. ఎవరో విదేశీయుడితో అఫైర్ కొనసాగిస్తున్నారనే వార్తలపై నిత్యమీనన్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

అజ్ఞాతవాసితో ఫొటో దిగి

అజ్ఞాతవాసితో ఫొటో దిగి

నిత్యమీనన్ ఓ అజ్ఞాతవాసిని గాఢంగా కౌగిలించుకొన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ, ఫ్రెండ్స్, లవ్ అంటూ పదాలతో ఫోటోను ట్యాగ్ చేసింది. దాంతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది. ప్రియుడిని కౌగిలించుకొన్నది అనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి.

 అతను నా లవర్ కాదు

అతను నా లవర్ కాదు

నిత్యమీనన్ అఫైర్ వార్త చేతులు దాటి పోతుండటంతో ఆమె స్వయంగా స్పందించారు. నేను కౌగిలించుకొన్న వ్యక్తి నాకు మంచి మిత్రుడు. అంతేకాకుండా నాకు సోదరుడిలాంటి వాడు. కానీ మీరు అనుకొంటున్నట్టు లవర్ కాదు అని నిత్యమీనన్ క్లారిటీ ఇచ్చేసింది.

నత్తనడకన కెరీర్‌తో

నత్తనడకన కెరీర్‌తో

టాలెంటెడ్ నటి అయిన నిత్యమీనన్ ఇటీవల కాలంలో కొంత వెనుకబడిపోయింది. ప్రయోగాత్మక పాత్రల్లో మెరిసిన ఆమె ప్రేక్షకులను మెప్పించలేకపోవడం రేసులో తన మార్కును ప్రదర్శించలేకపోయింది. దాంతో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిత్య కెరీర్ రెండేళ్లుగా నత్త నడకన సాగుతున్నది.

జయలలిత బయోపిక్‌ మూవీలో

జయలలిత బయోపిక్‌ మూవీలో

మాజీ ముఖ్యమంత్రి, నటి, స్వర్గీయ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌లో జయలలితగా నటిస్తున్నది. ఈ చిత్రానికి ఐరన్ లేడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల నిత్యమీనన్ గీత గోవిందం, ఎన్టీఆర్ బయోపిక్‌లో అతిథి పాత్రలో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X