నిత్యా మీనన్ ‘దిల్ సే’ చూస్తే...ఆ కోరిక!
అసిఫ్ అలీ, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం 'దిల్ సే'. మలయాళంలో విజయం సాధించిన 'వయొలిన్' చిత్రానికి ఇది తెలుగు అనువాద రూపం. శిబి మలయిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. లక్ష్మి అందిస్తున్నారు. ఈ చిత్రం రేపు(జూలై 27) విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ సినిమా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఇది రిథమిక్ లవ్ స్టోరీ. 'అలా మొదలైంది', 'ఇష్క్' తర్వాత నిత్యకు ఈ సినిమా మరో హిట్‌గా నిలవబోతోంది ఇందులో పాత్రలు, వాటి చిత్రణా చాలా బాగుంటాయన్నారు.
ఈ సినిమా చూశాక మనకూ వయొలిన్, గిటార్ వంటివి నేర్చుకోవాలనిపిస్తుంది. ఓ మ్యూజిక్ టీచర్‌కి జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఇందులోని ప్రధానాంశం. చక్కని క్వాలిటీతో డబ్బింగ్ చేశాం. జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ పిళ్లై సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా మలచింది' అని చెప్పారు.
విజయ రాఘవన్, నెడుముడి వేణు, శ్రీజిత్ రవి, చెంబిల్ అశోకన్, లక్ష్మీ రామకృష్ణన్, రీనా బషీర్ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సత్య, సంగీతం: బిజిబల్, కూర్పు: బిజిత్ బాలా, సహ నిర్మాత డి. రామకృష్ణ, కథ, దర్శకత్వం: శిబి మలయిల్.


Click it and Unblock the Notifications











