twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యామీనన్, శర్వానంద్ లవ్ స్టోరీ...లేటెస్ట్ అప్ డేట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్‌, నిత్యమీనన్‌ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్‌.

    నిర్మాత మాట్లాడుతూ ''పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. తాము కన్న కలల్ని సాకారం చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయంలో యువత ఏం చేస్తోందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేటి తరం ప్రేమ వ్యవహారాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు చేరన్‌. మనసుని హత్తుకునేలా భావోద్వేగాలుంటాయి. అంతే స్థాయిలో వినోదమూ ఉంటుంది. ఈ సినిమా యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. శర్వానంద్‌, నిత్యమీనన్‌ల జంట అందరినీ అలరిస్తుంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

    జాతీయ అవార్డ్‌ గ్రహీత చేరన్‌తో పనిచేయడం ఆనందాన్నిస్తోందని శర్వానంద్‌ అన్నారు. సిటీ నేపథ్యంలోని చక్కని కథాంశమిదని నిత్యామీనన్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, సమర్పణ: కృష్ణ చైతన్య.

    ఎంగేయుమ్ ఎప్పోదుమ్ (జర్ని)చిత్రంతో హిట్‌కొట్టిన తెలుగు నటుడు శర్వానంద్‌ను చేరన్ తన చిత్రలో హీరోగా ఎంచుకోవటం తో చాలా ఆనందగా ఉన్నాడు. జర్ని తర్వాత ఆయన తెలుగులో అల్లరి నరేష్,శ్రియలతో చేసిన నువ్వా..నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఆయన సినిమా కమిటయ్యేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులోనూ చేరన్ వంటి దర్శకుడు,నిత్యామీనన్ వంటి హీరోయిన్ అనేసరికి మరో మాట లేకుండా ఓకే చేసేసారు.

    ఇక ఈ చిత్రం తెలుగు రైట్స్ కి మంచి డిమాండ్ ఉండే అవకాసం ఉంది. అప్పుడే కొందరు డబ్బింగ్ నిర్మాతలు ఈ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రం కావటంతో యువతకు బాగా పడుతుందని,చేరన్ కి తెలుగులో సైతం మంచి పేరు ఉండటంతో ఇక్కడా ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దానికి తోడు నిత్యామీనన్ ఉందంటే డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్డిబిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. సినిమా ఎలా ఉన్నా ఓపినింగ్స్ కు లోటు ఉండదని,చిన్న సినిమాలకు ఓపినింగ్స్ బాగా మేలు చేస్తాయని చెప్తున్నారు.

    English summary
    
 Sarvanand has won a lot of praise for his work in Murugadoss’ maiden venture Journey. Now, director Cheran has roped in Sarvanand for his next film. Sources said that Cheran will stay behind the camera and call the shots and won't appear in front of the camera in the new film. The new movie is romance set in a city. Talks are on to rope in Nithya Menon, who is currently shooting in T-town. While Siddharth of Aravaan fame is the cinematographer, GV Prakash is composing the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X