నేషనల్ అవార్డు విన్నర్‌తో నిత్య
'అలా మొదలైంది" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత తెలుగు, తమిళంలో వరుస అవకాశాలను దక్కించుకుంది మలయాళ కుట్టి. ప్రఃస్తుతం నిత్య... నితిన్ సరసన 'ఇష్క్" అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.....'అలా మొదలైంది" సినిమా ద్వారా తనకు మంచి పేరు వచ్చింది, అయితే ఇప్పడు ఆ పేరును నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ చెప్పకొచ్చింది. ఇష్క్ తర్వాత ప్రస్తుతానికి తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదని, మలయాళంలో ఓ సినిమాను చేస్తున్నట్లు వెల్లడించారు. నేషనల్ అవార్డు విన్నర్ రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలిపింది.
మీ డ్రీమ్ రోల్ ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు నిత్య స్పందిస్తూ..అలాంటిదేమీ లేదని, అసలు తాను సినిమాల్లోకి వస్తానని, నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని, అనుకోకుండా వచ్చిన అవకాశంతో హీరోయిన్ అయ్యానని చెప్పకొచ్చింది. మలయాళ నిర్మాతల మండలి తనపై విధించిన బ్యాన్ పై మాట్లాడుతూ అది చాలా చిన్న, పర్సనల్ విషయమని, త్వరలోనే సద్దు మనుగుతుందని, తనకు మలయాళ దర్శకులు, నిర్మాతలతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉందని, మీడియా సపోర్టు కూడా ఉందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











