ఆమె ఔట్: నిత్యా మీనన్ వైపు త్రివిక్రమ్ చూపు?
హైదరాబాద్: ‘జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నసంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే హీరోయిన్లు సమంత, అదా శర్మ ఖరారయ్యారు. అయితే మూడో హీరోయిన్‌గా ప్రణీతను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో నిత్యా మీనన్‌ను తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
ఓ ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ స్నేహ నటిస్తోంది. ఆమె ఇందులో అల్లు అర్జున్ వదిన పాత్రలో నటించబోతోంది. ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవగా...ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా విడుదల చేయనున్నారు.

అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











