నిత్యా మీనన్ ‘మాలిని 22’ ఫస్ట్ లుక్(ఫోటో)
హైదరాబాద్: 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంతో తన నటన, గ్లామర్‌తో యూత్ మతిపోగొట్టిన నిత్యా మీనన్...త్వరలో 'మాలిని 22' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదో రివేంజ్ డ్రామా. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌తో పోస్టర్లో నిత్యా మీనన్ కత్తి పట్టుకుని దర్శనం ఇస్తోంది.
ఈ చిత్రాన్నికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో పాటు తమిళంలోనూ ఈచిత్రాన్ని విడదుల చేస్తున్నారు. తమిళంలో ఈచిత్రాన్ని '22 మాలిని పాళయం కోట్టై' పేరుతో విడుదల చేయనున్నారు. ఇది మహిళలపై బలాత్కారం ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని తెలుస్తోంది. 2012లో మళయాలంలో వచ్చిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రానికి ఇది రీమేక్.
ప్రస్తుతం దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో....ఈ చిత్రం ఒక సందేశాత్మకంగా, మేలుకొలుపుగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఈ సినిమాతో పాటు నిత్యా మీనన్ తెలుగులో 'ఏమిటో ఈ మాయ' అనే చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి చేరన్ దర్శకకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రం తమిళంలోనూ విడుదలకానుంది.


Click it and Unblock the Notifications












