బన్నీ-త్రివిక్రమ్ మూవీలో నిత్యా మీనన్ జాయినింగ్
హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నతాజా సినిమాలో మూడో హీరోయిన్ విషయం గతకొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తొలుత ఈచిత్రంలో మూడో హీరోయిన్ గా ప్రణీతను తీసుకుందామని డిసైడ్ అయ్యారు. అయితే ఆమెను తప్పించిన నిత్యామీనన్ ను తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విషయం ఖరారైంది. నవంబర్ నుండి నిత్యా మీనన్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ఈ చిత్రంలో ఇప్పటికే సమంత, అదా శర్మ హీరోయిన్లుగా ఖారారయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ స్నేహ నటిస్తోంది. ఆమె ఇందులో అల్లు అర్జున్ వదిన పాత్రలో నటించబోతోంది. ఏప్రిల్ 10న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవగా...ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా విడుదల చేయనున్నారు.
అల్లు అర్జున్ సినిమాలకు తమిళం, మలయాళంలో మంచి డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఆ నేటివిటీకి తగిన విధంగా ఆయా బాషలకు చెందిన యాక్టర్లను కూడా సినిమాలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











