తనతో తానే పోటీ పడుతున్న నిత్యా మీనన్ విచిత్ర పరిస్ధితి
అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్ పరిస్ధితి ఇప్పుడు గమ్మత్తుగా తయారైంది.ఆమె నటించిన రెండు సినిమాలు 180, సెగ ఒక రోజు తేడాలో ఆంధ్రా,తమిళ నాడులలో విడుదల అవుతున్నాయి.ఏది హిట్టయినా కలెక్షన్స్ ఎఫెక్టు రెండో దాని మీద గ్యారెంటీగా పడుతుందని ఆమె భావిస్తోంది.ఎందుకంటే రెండూ దాదాపు ఒకే తరహా చిత్రాలు కావటం ఒకెత్తు అయితే రెండూ తెలుగుకి డబ్బింగ్ చిత్రాలు కావటం మరో విశేషం.దీనికి తోడు ఆ సినిమాల్లో నటించిన నాని,సిద్దార్ధ ల మార్కెట్ హిట్టవుతేనే నిలబడే పరిస్ధితి ఉంది.విపరీతమైన ఓపినింగ్స్ కలెక్షన్స్ ని ఎక్సపెక్ట్ చేయటానకి అవకాశం లేదని సిట్యువేషన్.దాంతో నిత్యామీనన్ చాలా టెన్షన్ గా భాక్సాఫీస్ వైపు చూస్తోంది.ఇక ఈ సినిమాలు కాకుండా నిత్యా ..నితిన్ సరనస ఇష్క్ సినిమాలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











