నిత్యా మీనన్ 'సెగ' రగిలేదెప్పుడంటే..
నాని, నిత్యామీనన్ కాంబినేషన్ లో రూపొందిన 'సెగ'చిత్రం విడుదల తేది ఖరారు అయ్యింది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.అలా మొదలైంది కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో రూపిందిన వెప్పం చిత్రానికి రీమేక్.తెలుగు ప్రేక్షకులకు అశోక్ వల్లభనేని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఆవకాయ బిర్యాని ఫేమే బిందు మాధవి ఓ కీలకపాత్రను పోషించింది. ఈ చిత్రం డైరక్ట్ చేసింది అంజన అనే మహిళా దర్శకురాలు.
దర్శకురాలు ఈ చిత్రం గురించి చెపుతూ..ప్రేమంటే లక్ష్యాన్నీ, భవిష్యత్తునీ నిర్దేశించేది. మా సినిమాలోనూ ఓ ప్రేమ జంట ఉంది. ఆ ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో? చివరి మజిలీ ఏమిటో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటోంది.ఇక నిర్మాత మాట్లాడుతూ..'యువత ఆలోచనలు, ఆశలు ప్రతిబింబించే చిత్రమిది. సినిమా చూస్తున్నంతసేపూ నిజ జీవితాన్ని పరిశీలిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. నాని, నిత్య జంట మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనేలా నటించిందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం: జోష్వా శ్రీధర్.


Click it and Unblock the Notifications











