ఆ భార్గవ్ కి నాకు సంబంధం లేదు.. అందుకే లైవ్ లోకి వచ్చా.. కేరాఫ్ కంచరపాలెం సునీత క్లారిటీ !

టిక్ టాక్ వీడియోల పేరుతో ఒక మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖపట్నం దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం దిశ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ప్రేమ్ కాజల్ మీడియా సమావేశం కూడా నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఈ కేసు తాను హ్యాండోవర్ చేసుకున్నానని చెల్లి అని పిలుస్తూ 14 ఏళ్ల బాలికను అతను లొంగదీసుకుని రేప్ చేశాడని ఆమె వెల్లడించారు. అతనిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మూడో తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఆమె పేర్కొన్నారు.

టిక్ టాక్ మొదలు పెట్టి

టిక్ టాక్ మొదలు పెట్టి

విజయనగరం జిల్లా కొత్తవలస కు చెందిన చిప్పాడ భార్గవ్ యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. హైదరాబాద్ లో ఒక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియోలు రావడంతో అతనికి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపు తోనే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు కూడా సంపాదించాడు. అయితే ఇక్కడ వస్తున్న ఆదాయం తక్కువగా ఉందని భావించి టిక్ టాక్ వీడియోలు చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలియడంతో టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.

చెల్లి అని పిలుస్తూనే

చెల్లి అని పిలుస్తూనే

అలా వీడియోలు చేస్తున్న నేపథ్యంలో టిక్ టాక్ లో భార్గవ్ 14 ఏళ్ల మైనర్ బాలిక పరిచయమైంది. ఆమె తో కూడా వీడియోలు చేస్తానని నమ్మబలికి పరిచయం పెంచుకున్న భార్గవ్ ముందు ఆమెకు ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు, అయితే ఆమె ఒప్పుకోకపోవడం తో చెల్లి అని పిలుస్తూ ఆమెను భయపెట్టి బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆమె దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీశానని అవి బయట పెడతానని బెదిరింపులుతో ఆమెను లొంగదీసుకున్నట్లుగా కేసు రిజిస్టర్ అయింది. అయితే ఈ క్రమంలో గతంలో భార్గవ్ తో పాటు వీడియోలు చేసిన కేరాఫ్ కంచరపాలం సినిమాలో సునీత అనే పాత్రలో నటించిన మరో బాలిక నిత్య శ్రీని అందరూ టార్గెట్ చేస్తున్నారు.

ఊహాగానాలతో

ఊహాగానాలతో


కొంతమంది ఊహాగానాలతో ఆ బాలిక ఈమేనా అన్నట్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడంతో సదరు బాలిక తన తల్లితో కలిసి ఇంస్టాగ్రామ్ లో లైవ్ వచ్చింది. భార్గవ్ అరెస్టయిన సంగతి తనకు తెలియదు అని అందరిలాగే తాను కూడా సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికే చాలా మంది తన ఫోటోలు పెడుతున్నారని ఒకవేళ తెలియక అలా పెడితే సరేనని అందుకే వారందరికీ క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు అసలు ఏమీ తెలియదని తను భార్గవ్ కలిసి కూడా సంవత్సరం దాటిందని చెప్పుకొచ్చింది. తాము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక భార్గవ్ తో టచ్ లో లేనని ప్రస్తుతం తాను సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

 కారు, ఫోన్ స్వాధీనం

కారు, ఫోన్ స్వాధీనం

బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్‌ భార్గవ్‌ ను అరెస్ట్ చేశామని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 16 న బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, భార్గవ్ అరెస్ట్ను చేయగా మూడో తేదీ వరకూ రిమాండ్‌ విధించారని పేర్కొన్నారు. టిక్‌టాక్‌ నిషేధానికి గురికావడంతో మోజో, రెపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడని, టిక్ టాక్ లో ఇతర మీడియాలో అవకాశం ఇప్పిస్తానని 14 ఏళ్ల మైనర్ బాలిక ను లైంగికంగా వాడుకున్నాడని వారు పేర్కొన్నారు. ఆ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని భార్గవ్ వెంటపడ్డాడని, ఆమె నో చెప్పిన వినకుండా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు పోటోలు తీసి ఉన్నాయంటు బెదిరించి లోబరుచుకున్నాడని అన్నారు. భార్గవ్ కారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: tik tok
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X