రాజేంద్రప్రసాద్ అయ్యారేపై స్వామి నిత్యానంద పిటిషన్
రాజేంద్రప్రసాద్ నటించిన అయ్యారే సినిమా ప్రదర్శనను నిలిపేయాలని కోరుతూ సెక్స్ స్వామి నిత్యానంద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినీ నటి రంజితతో రాసలీలలు జరుపుతూ స్వామి నిత్యానంద వీడియోకు చిక్కిన ఇతివృత్తం ఆధారంగా అయ్యారే సినిమాను నిర్మించారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో స్వామి నిత్యానంద పాత్రను పోషించారు. ఈ సినిమా తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని అంటూ ఆ సినిమా విడుదలను అనుమతించవద్దని స్వామి నిత్యానంద కోర్టును కోరారు. అయ్యారే సినిమా షూటింగ్ సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమైంది. సినిమా నిర్మాణం పూర్తయి విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సినిమాకు సాగర చంద్ర దర్శకత్వం వహించారు. బి. సుధాకర్, రంగన, అచ్చప్ప నిర్మాతలు. ఈ సినిమాలో పోలీసాఫీసరు పాత్రను సాయికుమార్ పోషించారు.


Click it and Unblock the Notifications











