'ఖుషి' సినిమాకు కొనసాగింపు
కొంతమంది 'ఖుషి', 'సఖి'లకు కొనసాగింపు అని చెబుతున్నారు. ఈ స్పందన నాలో ఉత్సాహాన్ని నింపిందని నితిన్ అన్నారు. ఆయన తాజా చిత్రం 'ఇష్క్'ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నితిన్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అలాగే ''సంగీతం, ఫొటోగ్రఫీ, నిత్యమీనన్‌తో నా కెమిస్ట్రీ... ఈ మూడూ 'ఇష్క్' సినిమాలో బాగా కుదిరాయి. అందుకే ఇంత ఆదరణ పొందుతోంది. థియేటర్లో కూర్చుని సినిమా చూసి... ప్రేక్షకుల స్పందన స్వయంగా తెలుసుకొన్నా. ఇటీవల కాలంలో ఇంత మంచి సినిమా రాలేదని చెబుతున్నారు. సినిమా బాగుంటేనే చూస్తున్నారు.
నచ్చకపోతే రెండో ఆట నుంచే... థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. 'ఇష్క్' వసూళ్లు మాత్రం ఆట ఆటకూ పెరుగుతున్నాయి. 'సై' తరవాత ఇంత స్పందన వచ్చిన చిత్రం ఇదే అన్నారు. నిర్మాత నిర్మాత విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ ''అనుకొన్నదానికంటే మంచి ఫలితం వచ్చింది. అనూప్ స్వరాలు, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం... ప్రేక్షకులకు నచ్చుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అనూప్, మాటల రచయిత రమేష్ సామల కూడా పాల్గొన్నారు. నిత్యమీనన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











