Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
వర్మతో 'సినిమా ఆడదు' అన్నాను: నితిన్
రీసెంట్ గా ఇష్క్ సినిమాతో హిట్ కొట్టిన నితిన్ మీద వర్మ కన్ను పడింది. ఆయన తాజాగా నితిన్ తో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని నితిన్ మీడియాకు తెలియచేస్తూ...గతంలో 'అడవి' సినిమా వర్మతీశారు. అప్పట్లో నాకు ముందు చెప్పిన కథను ఆయన మార్చేశారు. అది చూసి 'ఇది ఆడదు' అన్నాను. చివరకు అలానే జరిగింది. ఆ తర్వాత ఆయనే అన్నారు. నువ్వుచెప్పినట్లే జరిగిందని. మళ్ళీ వర్మగారు నాతో సినిమా తీస్తానన్నారు. అది కొత్తగా ఉంటుంది అన్నారు. ఇది విన్న వాళ్లు వరస ప్లాపుల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ తో ఇప్పుడే హిట్ లోకి ప్రవేశించిన నితిన్ కమిటవటం చూసి నవ్వుకుంటున్నారు. వర్మ చేతిలో పడితే మంచి రోజులు ప్రారంభం కానట్లే అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నితిన్ ..తాను నందినిరెడ్డి, సురేందర్‌రెడ్డితో కూడా సినిమా చేసే అవకాశాలున్నాయని అన్నారు.
అలాగే మల్టీస్టారర్ చిత్రం జనవరిలో ఉంటుంది. అది నా వయస్సుఉన్న హీరో తో. ప్రస్తుతం బెల్లంకొండ సురేస్ నిర్మాతగా, విజరు దర్శకత్వంలోనూ సినిమాలు చేయబోతున్నాను. ఇవికాకుండా 'కాటన్కింగ్' అనే ముంబైకు చెందిన కంపెనీకి మోడల్‌గా వ్యవహరిస్తున్నాను. హిందీలో ఇష్క్ రీమేక్చేస్తున్నారు. అందులో నేను నటించడంలేదు. తమిళ, కన్నడలోకూడా రీమేక్ చేయాలని నిర్మాతలు ఆలోచనలో ఉన్నారు అని చెప్పుకొచ్చారు.