‘కొరియర్ బాయ్ కళ్యాణ్’గా నితిన్
ఇప్పటికే 'ఇష్క్' సక్సెస్‌తో మాంచి ఊపు మీదున్న నితిన్... ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే గౌతమ్‌మీనన్‌తో మరోమారు హిట్ కొట్టవచ్చని ఆశ పడుతున్నాడు. తెలుగు..తమిళ..హిందీ చిత్రాలపై దర్శకుడిగా గౌతమ్‌మీనన్ తనదైన ముద్ర వేశారు. ఘర్షణ, ఏం మాయ చేశావే...వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువైన గౌతమ్‌మీనన్, ప్రస్తుతం నాని, సమంతాలతో ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని తర్వాత నితిన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రానికి 'కొరియర్ బాయ్ కళ్యాణ్ ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పేరునే దాదాపుగా ఖరారు చేయనున్నారి సమాచారం. రీచాను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ చిత్రం ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ప్రేమ్ సాయి గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించనున్నారు. ఈ నెలలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
తన సినిమా పూర్తయ్యేలోగా గౌతం మీనన్ దర్శకత్వం వహించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రం విడుదలౌతుంది. కాబట్టి, ఆ సినిమా సక్సెస్ ప్రభావం తన సినిమాపై పడుతుందని నితిన్ భావిస్తున్నాడని చెబుతున్నారు. నితిన్ ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ బ్యానర్లో శృతిహాసన్ కథానాయికగా ఓ సినిమాతో పాటు.....శ్రేష్ట మూవీస్ బ్యానర్‌పై నిత్యామీనన్ జంటగా మరో సినిమా చేయనున్నాడు.
చాలాకాలం నుంచి హిట్ లేక అల్లాడుతున్న యంగ్ హీరో నితిన్ కెరీర్ కు 'ఇష్క్' మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇష్క్ సినిమా ముందు వరకు ఎలాంటి సినిమాలో నటించాలో తెలియక తికమకపడిన నితిన్... ఇప్పుడు మాత్రం తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











