నాకు ప్రాంతీయ భేదం లేదు-నాకు అందరూ కావాలి: నితిన్
ఇవ్వాళ జాతి ద్వేషాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంది. దారికి తోడు సినీ పరిశ్రమకు ఆ సెగలు ఉదతంగా సోకాయి. దీంతో సినిమా పరిశ్రమలో రెండు తెగలుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోల్లో 'నితిన్ రెడ్డి" ఒకరు. ఇప్పుడాయన 'సీతారాముల కళ్యాణం" లంకలో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దర్శకుడు ఈశ్వర్ కూడా తెలంగాణ వ్యక్తే. నిర్మాత మాత్రం విశాఖ ప్రాంతానికి చెందిన సమైఖ్యావాది మళ్ల విజయప్రసాద్. తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి నితిన్ హీరో అవుతాడని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో నితిన్ స్పందిస్తూ 'చూడండీ...నేను మొదట నటుడ్ని. నాకు ప్రాంతీయ భేదాలు ఉండవు, ఉండకూడదు. ప్రజలంతా ఒక్కటే. అందరూ నా సినిమా చూడాలని కోరుకుంటాను ఇక ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడెంత పెద్దవాణ్ణి కాదు ఎప్పటికైనా అందరూ సినిమాలను ఆదరించే రోజు వస్తుంది. కాబట్టి విచారించాల్పిన అవసరం లేదంటున్నాడు నితిన్.


Click it and Unblock the Notifications











