twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ 'హార్ట్‌ఎటాక్‌' లో నితిన్ క్యారక్టరైజేషన్ ఇదే

    By Srikanya
    |

    హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ సినిమాలంటే క్యారక్టరైజేషన్ ప్రధానంగా సాగుతాయి. అందుకే ఆయన చిత్రాల్లో నటించటానికి హీరోలు ఆసక్తి చూపుతూంటారు. తాజాగా ఆయన నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్‌' రూపొందిస్తున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ఈసారి నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. క్యారక్టరైజేషన్ తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

    నిర్మాత మాట్లాడుతూ... ''మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.

    ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్‌'. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్‌ సరసన ఆదా శర్మ హీరోయిన్ . ప్రస్తుతం స్పెయిన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశాలు విశ్రాంతికి ముందొస్తాయట.

    అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈచిత్రంలో నితిన్‌కు లుక్ తాజాగా బయటకు వచ్చింది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.

    English summary
    Usually the lead characters in Puri Jagannath's film bear a rough characterization. Now it's Nitin's time. Now Puri is also taking special care about Nitin. He is presenting Nitin in a ultra-stylish look. Also we will see a new slick action angle of Nitin in this flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X