మళ్లీ ‘దిల్’రాజు, నితిన్ కాంబినేషన్?
హైదరాబాద్ : దిల్ సినిమాతో నిర్మాతగా పరిచయమైన నిర్మాత రాజు...ఆ సినిమా హిట్ కావడంతో 'దిల్ రాజు'గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన ఈ చిత్రంలో యువ హీరో నితిన్ హీరోగా నటించాడు. తాజాగా దిల్ రాజు-నితిన్ మరోసారి కలిసి పని చేయబోతున్నారని తెలుస్తోంది.
ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు కలిసి 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే టైటిల్ తో రూపొందబోయే సినిమా చేయబోతున్నారని, రొమాన్స్ అండ్ కామెడీతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈచిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు.
అయితే ఈ సినిమా విషయమై దిల్ రాజు నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంతో హిట్ కొట్టిన నితిన్ ప్రస్తుతం కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
ఇక దిల్ రాజు విషయానికొస్తే....ప్రస్తుతం ఎవడు చిత్రానికి నిర్మాతగా ఉన్న ఆయన ఆ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












