నితిన్, కరుణాకరన్ మూవీ టైటిల్ ఇదే
హైదరాబాద్ : నితిన్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి'చిన్నదాన నీ కోసం'అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ విషయాన్ని నితిన్ ట్వీట్ ద్వారా తెలియచేసారు. నితిన్ ట్వీట్ చేస్తూ..." సో.. కరుణాకరణ్ గారితో చేస్తున్న నా సినిమా టైటిల్ చిన్నదాన నీ కోసం...ఎలా ఉందో చెప్పండి....." అన్నారు. ఇక 'చిన్నదాన నీ కోసం'టైటిల్ ని నితిన్ హిట్ చిత్రం ఇష్క్ నుంచి తీసుకున్నారు.
నిర్మాత నికితా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన "ఇష్క్", "గుండేజారి గల్ల౦తయ్యి౦దే" లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలిపారు.

శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.


Click it and Unblock the Notifications











