»   » పవన్ కళ్యాణ్ పంపిన పార్శిల్ ఇదే... (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ పంపిన పార్శిల్ ఇదే... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోట నుండి ప్రతి వేసవిలో ఆయన సన్నిహితులకు ఓ పార్శిల్ వెలుతుంది. అదేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మీరు ఊహించింది నిజమే. ఆయన ప్రతి సంవత్సరం తన సన్నిహితులకు మామిడి పళ్లు పంపిస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని అయిన నితిన్ ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా ఆయన తోట నుండి వచ్చిన మామిడి పళ్లు అందుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Nitin got mangoes from Pawan Kalyan

నితిన్ తో పాటు పలువులు సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ తోటలోని మామిడి పండ్లు అందుకున్న వారిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా హైదరాబాద్ శివారులోని తన తోటలోనే గడుపుతారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి స్థాయిలో సేంద్రీయ ఎరువులను వాడుతూ ఇక్కడ పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు.

English summary
Tollywood actor Nitin got mangoes from power star Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu