నేను గర్వంతో చెప్పుకునే చిత్రం ఇది..హన్సిక
నితిన్, హన్సిక కాంబినేషన్లో రెడీ అవుతున్న సీతారాముల కళ్యాణం..లంకలో చిత్రం జనవరి 19న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 19న విశాఖపట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..కొద్ది రోజుల షూటింగ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. అలాగే ఈ చిత్రం అవుట్ కమ్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. హీరోయిన్ హన్సిక మరో ముందుడుగు వేసి ఈ చిత్రం చేయటం నాకు గర్వ కారణమంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని వర్ణించింది. ఇక దర్శకుడు ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ..నితిన్ కెరీర్ లో పెద్ద హిట్లు అయిన సై,దిల్,జయం చిత్రాల సరసన ఈ మా చిత్రం నిలుస్తుందని హామీ ఇచ్చాడు. ఈ చిత్రం ముందు నితిన్ వరస ఫ్లాఫ్ లలో ఉన్నారు. ఈ మధ్యే ఇలియానాతో చేసిన రెచ్చిపో చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని పొందింది. ఇక హన్సిక..కళ్యాణ్ రామ్ చిత్రం జయీభవ తర్వాత చేస్తున్న చిత్రం. జయీభవ కూడా ఫెయిల్యూర్ అయింది. దర్శకుడు ఈశ్వరరెడ్డి ఇంతకు ముందు అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రమ్ శీకాకుళం చిత్రం రూపొందించాడు. ఆ చిత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక నిర్మాతలు కూడా సిద్దు ప్రమ్ శీకాకుళం నిర్మించిన వారే కావటం విశేషం.


Click it and Unblock the Notifications











