పిలకతో నితిన్...‘హార్ట్ ఎటాక్’ లుక్
ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవల జరిగి తొలి షెడ్యూల్ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్ చిత్రీకరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది.
వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం యూరఫ్ బయల్దేరి వెళ్లింది. ఇక్కడే సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ జరుగనుంది. నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.


Click it and Unblock the Notifications












