ఇలియానా ఇంటికి వెళ్ళి గొడవ చెయ్యలేదు...నితిన్
యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా ఇలియానా ఇంటికి వెళ్ళి గొడవ చేసాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని నితిన్ ఖండిస్తున్నాడు. అవన్నీ రూమర్స్ మాత్రమే... షూటింగ్ గోవాలో ఇలియినా ఇంటి దగ్గరలోనే జరుగుతుంది.దాంతో ఆమెతో ఉన్న పరిచయం కొద్దీ ఆమె ఇంటికి వెళ్ళినమాట వాస్తమే.. అయితే అక్కడ గొడవేం చేయలేదు. వాళ్లింటిలో 11 పిల్లులు, 4 కుక్కలు వున్నాయి. పిల్లులంటే నాకు చికాకు... కుక్కలేమో మొగురుతూ విసిగించాయి. అంతే అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు అన్నాడు. ఇక ప్రస్తుతం నితిన్ ఇష్క్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అతని సరసన అలా మొదలైంది హీరోయిన్ నిత్యా మీనన్ నటి్స్తోంది. అలాగే గతంలో తెలుగులో ఇష్టం సినిమాకు దర్శకత్వం వహించి ఇటీవల 13బి (మాధవన్, నీతూ చంద్ర) అనే బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పి.సి.శ్రీరామ్ కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా గోవా లో షూటింగ్ జరుపుకుంది.


Click it and Unblock the Notifications











