దేవదాసు చిత్రంతో పరిచయమైన ఇలియానాతో ఎప్పుడో చేయాల్సి ఉందని, అయితే అప్పట్లో కుదరలేదని నితిన్ అంటున్నారు. తాజాగా మిర్చి పేరుతో రెడీ అవుతున్న సినిమాలో ఇలియానా, నితిన్ జంటగా చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయి లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయని అంటున్నాడు. ఇక ఇలియానాతో తాను ధైర్యం సినిమాలో చేయాల్సి ఉందని, అందునిమిత్తం ఫొటో షూట్ కూడా చేసారని, కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదంటున్నాడు. ఇక ఇది విన్న వారు నితిన్ హిట్టు లు లేక చివరకు ఇలియానా తన సినిమాలో నటిస్తోందనే విషయాన్ని హైలెట్ చేసి క్రేజ్ సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. స్పెక్ట్రా మీడియా పతాకంపై తయారవుతున్న ఈ చిత్రాన్ని పరుచూరి మురళి డైరక్ట్ చేస్తున్నాడు. మరళి గతంలో పెదబాబు, ఆంధ్రుడు చిత్రాలను రూపొందించాడు.