twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ ఇంటివాడు కాబోతున్న నితిన్, త్వరలో పెళ్లి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నితిన్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇప్పటికే 31 సంవత్సరాలు క్రాస్ అయిన నితిన్‌కు త్వరగా పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు చూస్తున్నారు. తగిన జోడీ కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే కొందరు అమ్మాయిలను చూసినా....ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. మరి కొన్ని రోజుల్లోనే నితిన్ పెళ్లి వార్త వినబోతున్నాం.

    Nitin is likely to get married soon

    తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన నితిన్ తొలి సినిమాతోనే విజయం అందుకోవడంతో పాటు వెంటనే దిల్, సై లాంటి వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు సరైన హిట్టు లేక సతమతం అయిన నితిన్....ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్ చిత్రాలతో హాట్రిక్ అందుకున్నాడు.

    ప్రస్తుతం నితిన్...కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రేమసాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌతం మీనన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని తర్వాత గౌతం మీనన్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఖరారైంది. 2015లో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది.

    English summary
    If rumour mills are to be believed, young Telugu hero Nitin reddy is likely to get married soon. Buzz is that Nithin family is busy with searching a suitable bride for the young hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X