రాబోయే కాలానికి కాబోయే మెగస్టార్ ‘నితిన్’..?
రాష్ట్ర విభజన గొడవలు ముదిరి పాకాన పడ్డ తరుణంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన హీరోల సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని తెలంగాణా వాదులు అల్టిమేటం జారీ చేశారు. చిరంజీవి ఫ్యామిలీ, నందమూరి కుటుంబం, అక్కినేని, ఘట్టమనేని కుటుంబాలన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవే. ప్రభాస్, రవితేజ, గోపిచంద్ సహా యువ హీరోలంతా అటు నుంచి వచ్చినవారే. ఇక నైజాంలో వీళ్ల సినిమాలు జామ్ అని ఇక్కడి వారు గట్టిగా అంటోంటే మరి వీరు ఎవరి సినిమాలు చూస్తారట? అనే ప్రశ్న పుట్టక మానదు.
వెంటనే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చే తెలంగాణా హీరో నితిన్ ఒక్కడే! ఒక వేళ నిజంగానే నైజాం జనం సీడెడ్, ఆంధ్ర ప్రాంత హీరోలని బ్యాన్ చేశారే అనుకుందాం. అప్పుడిక నైజాంకి నితిన్ ఏక్ నిరంజన్ అయిపోతాడేమో? అయినా పిచ్చి కాకపోతే అరవోడు నటించిన సినిమాల్ని కూడా గుడ్డలు చించుకుని చూసేసే వెర్రి జనానికి, సాటి తెలుగోడు పగవాడైపోయాడా? కలిసుందాం బాబూ అని మంచి మాటలు చెబుతుంటే పిచ్చేక్కుతోందా? పిచ్చితనానికి పరాకాష్ట అంటే సినీ పరిశ్రమని టార్గెట్ చేయడం కాదూ!!


Click it and Unblock the Notifications











