నితిన్ ‘ఇష్క్’ సెన్సార్ రిపోర్ట్
నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ 'ఇష్క్' ఫిబ్రవరి 24న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇష్క్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డువారు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.
ఈ చిత్రంలో నితిన్ స్వయంగా పాడిన 'కోడిపాయే లచ్చమ్మది' పాటతో పాటు అన్ని పాటలు మంచి సక్సెస్ సాధించాయి. సినిమా ట్రైలర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రేమకథా చిత్రమే అయినా...రోటీన్ కి భిన్నంగా, కన్నుల విందుగా, వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందించారని అంటున్నారు. చాలా కాలంగా హిట్టనేదే లేని నితిన్ ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై, మల్టీ డైమండ్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ పి.సి. శ్రీరామ్, ఎడిటింగ్: శేఖర్ ప్రసాద్, నిర్మాత: విక్రమ్ కుమార్ గౌడ్


Click it and Unblock the Notifications











