నితిన్, నిత్య మీనన్ ఇష్క్ విడుదల తేదీ ఖరారు

By Bojja Kumar

నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ 'ఇష్క్' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేమకథ సినిమా అయినప్పటికీ ఇప్పటి తరం యువతకు నచ్చే విధంగా, విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నితిన్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉంటుందని సినిమా యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.

మరో వైపు ఈ చిత్రానికి సంబంధించి నితిన్ స్వయంగా పాడిన 'కోడిపాయే లచ్చమ్మది' పాట సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ చిత్ర విజయంపై అంచనాలు పెరిగి పోయాయి. సినిమా ట్రైలర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటం కూడా సినిమాకు ప్లస్సవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజిలో ఉంది. చాలా కాలంగా సరైన హిట్ లేని నితిన్ సినిమా కెరీర్ వరుస ప్లాపులతో అటూ ఇటుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈచిత్రం మళ్లీ తనకు పరిశ్రమలో స్థానం సుస్థిరం చేస్తుందని ఈ యువ హీరో బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై, మల్టీ డైమండ్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ పి.సి. శ్రీరామ్, ఎడిటింగ్: శేఖర్ ప్రసాద్, నిర్మాత: విక్రమ్ కుమార్ గౌడ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X