నితిన్ కి హిందీ మార్కెట్ ఉందనే రిలీజ్
నితిన్ నటించిన జయం చిత్రం హిందీలోకి డబ్బింగ్ అవుతోంది. త్వరలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సదా,నితిన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఇన్నాళ్ళకు హిందీ మార్కెట్ లోకి ప్రవేశించటానికి ఓ కారణం ఉంది. ఈ మధ్యన నితిన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ అడవి అనే చిత్రం తీసి వదిలారు. దాంతో నితిన్ బాలీవుడ్ ప్రవేశం జరిగినట్లయింది. ఇక అపరిచితుడు హిందీ వెర్షన్ తో సదా అక్కడ కొన్ని సినిమాలు పట్టుకుంది. దాంతో వీరి జంటని హిందీవాళ్ళు చూసే అవకాశం ఉందని భావించిన ఔత్సాహికులు ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేస్తున్నారు. అందులోనూ ఈ చిత్ర దర్శకుడు తేజ గతంలో హిందీలో తుషార్ కపూర్ తో నువ్వు-నేను చిత్రం రీమేక్ చేసారు. కాబట్టి మార్కెట్ కి ఢోకా లేదని బావిస్తున్నారు. ఇది కాని వర్కవుట్ అయితే నితిన్ మిగతా చిత్రాలు కూడా చక్కగా డబ్బింగ్ చేసుకోవచ్చు. ఫ్లాప్ అయ్యాయని భాధపడుతున్న నిర్మాతలుకు ఇదో ఊరడింపు అవతుందనటంలో ఏ సందేహం లేదు.


Click it and Unblock the Notifications











