పవన్ మేనియా! కరుణాకరన్ దర్శకత్వంలో నితిన్
గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం విజయం వెనక కథ, దర్శకుడి పనితనం, హీరో హీరోయిన్ల టాలెంట్ ఉన్నప్పటికీ.....చిత్రంలో పవన్ కళ్యాణ్ పాట రీమేక్ చేసి పవన్ మేనియాను సినిమాలోకి జొప్పించడం వల్లనే భారీ విజయం సాధించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో తన ఎదుగుదలకు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను సపోర్టుగా వాడుకుంటున్న నితిన్....'ప్రస్తుతం కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమా చేస్తున్నాడు. ఈచిత్రం తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ మార్కు పడేలా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. గతంలో పవన్ కళ్యాణ్‌కు 'తొలిప్రేమ' లాంటి భారీ విజయాన్ని అందించిన కరుణాకరన్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడని తెలిసింది.
ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ సోదరి నిఖితరెడ్డి నిర్మించనున్నారని చిత్ర వర్గాల సమాచారం. 'ప్రస్తుతం చేస్తున్న 'కొరియర్ బోయ్ కల్యాణ్' సినిమా తరువాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది' అని తన సోషల్ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో నితిన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications












