పవన్ ఫోటోకు ముద్దిచ్చిన నితిన్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్: నితిన్ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన తాజా చిత్రం 'చిన్నదాన నీ కోసం' చిత్రం ఆడియో సందర్భంగా ఓ అభిమాని పవన్ కళ్యాన్, నితిన్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్దాడి నితిన్ తన అభిమానాన్ని సభాముఖంగా చాటారు. పవన్ ఫోటో ఎక్కడ పెట్టుకుంటారని అడగ్గా... ఆయన తన గుండెల్లో ఉన్నారంటూ నితిన్ జవాబిచ్చారు. ఆ ఫొటో ముద్దాడిని విధానాన్ని మీరు ఈ క్రింద వీడియోలో చూడవచ్చు.

ఇక 'చిన్నదాన నీ కోసం' సినిమా అందరికీ నచ్చుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే...అభిమానులు లేకుంటే ఏ హీరో లేడని నితిన్ అన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా హీరోలకు అండగా నిలిచేది అభిమానులేనని పేర్కొన్నారు.

Nitin kissed Pawan Kalyan's Photo at Audio function

అలాగే...నితిన్ మాట్లాడుతూ... కాలు బెనకడంతో ఈ సినిమాలో ఓ పాటకు డాన్స్ సరిగా చేయలేకపోయానని తెలిపారు. ఇందుకు ఫ్యాన్స్ తనను క్షమించాలని వేడుకున్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమతోనే ఇంత కష్టపడుతున్నానని చెప్పారు. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. తామంతా పవన్ కళ్యాణ్ అభిమానులమని పునరుద్ఘాటించారు.

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ భామ మిస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇష్క్ చిత్రంలో ప్రజాదరణ పొందిన గీతంలోని చరణాన్ని టైటిల్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం కరుణాకరణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు.

శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X