'వయొలెంట్ బట్ సైలెంట్'...ఈ నెల 23న
'వయొలెంట్ బట్ సైలెంట్' అనే ట్యాగ్ లైన్ తో రెడీ అయిన 'మారో' ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్, మీరాచోప్రా జంటగా రూపొందిన చిత్రం గురించి మీడియా సమావేశంలో దర్శక, నిర్మాతలు తెలియచేసారు. దర్శకుడు సిద్ధిక్ మాట్లాడుతూ...మలయాళంలో తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించిన నేను తెలుగులో దర్శకత్వం వహించిన తొలిచిత్రమిది..మైండ్ గేమ్ ప్రధానాంశం చేసుకొని రూపొందిస్తున్న ఈ చిత్రంలో నితిన్ పాత్ర ఎంతో వైవిధ్యంగా వుంటుంది. ఐఐటి విద్యార్థిగా, ఎంతో ఎనర్జిటిక్ గా తను ఈ చిత్రంలో కనిపిస్తాడు. బుద్ధిబలంతో పాటు భుజబలం కూడా కలిగిన యువకుడిగా నితిన్ అభినయం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది అన్నారు. ఇక ఈ చిత్రాన్ని మామిడాల శ్రీనివాస్, వేణు.ఎమ్.కొండ్లే నిర్మించారు. అలాగే సినిమా పూర్తయి దాదాపు రెండు సంవత్సరాలు పైగానే అయిన ఈ చిత్రం నితిన్ కి హిట్టు ఇస్తుందా లేక ఫ్లాప్ ఖాతాలో మరొకటి చేరుతుందా అనేది చూడాలి. సిద్దిక్ దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన బాడీ గార్డ్ చిత్రం తెలుగులో వెంకటేష్ తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











