ఎట్టకేలకు నితిన్ ‘మారో’చిత్రం విడుదల తేదీ ప్రకటించారు
నితిన్, మీరాచోప్రా కాంబినేషన్ లో రూపొందిన 'మారో" చిత్రం జూలై నాలుగున విడుదల చేయాలని రిలీజ్ డేట్ ప్రకటించారు.మలయాళ దర్శకుడు సిద్దిక్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ఇది.ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రాజు మాట్లాడుతూ…"ఢీ చిత్రం కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనా ఆ తర్వాత రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది. 'మారో" కథ నచ్చి విడుదల చేస్తున్నాం. తమిళంలో 'సాధు మరిండా" పేరుతో విడుదలై విజయం పొందింది. తెలుగులో వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేస్తున్నాం. సిద్ధిక్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రాలు తెలుగులో హిట్లర్, పెద్దరికం…అనే పేర్లతో వచ్చాయి. 'మారో" అద్భుతమైన కథ. యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు" అని చెప్పారు.మైండ్‌గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ ఐఐటి విద్యార్థిగా కనిపిస్తారు. అబ్బాస్, కోట శ్రీనివాసరావు, అలీ, వేణుమాధవ్, రఘుబాబు, చలపతిరావు, నరసింహరాజు, తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: చింతపల్లిరమణ, సంగీతం: మణిశర్మ, కెమెరా: జయరామ్, సహ నిర్మాతలు: ఎస్.అనిల్ కుమార్, డి.శైలేందర్.


Click it and Unblock the Notifications











