ఇష్క్ నా కెరీర్‌కు గొప్ప విజయాన్ని ఇస్తుంది: నితిన్
"మంచి కథ, నెంబర్ వన్ టెక్నీషియన్ల కలయికలో తెరకెక్కుతున్న 'ఇష్క్' నా కెరీర్‌కు గొప్ప విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉంది'' అని నితిన్ అన్నారు. నితిన్ హీరోగా శ్రేష్ట్ మీడియా ప్రై. లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఇష్క్'. ఈ నెల 16న సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ మీడియాతో మాట్లాడారు. అలాగే...''ఇష్క్ అనే పేరు వినగానే ప్రేమ కథ అని అర్థమైపోతుంది. ఓ యువ జంట ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే కథ ఇది.
ఇప్పటి వరకూ నేను ఇలాంటి చిత్రంలో నటించలేదు. ఈ తరహా పాత్ర పోషించలేదు. వినోద ప్రధానంగా సాగుతుందన్నాడు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ "ఇష్క్ ...ఇప్పటివరకు వచ్చిన లవ్‌స్టోరీలకు భిన్నంగా, సరికొత్త ట్రీట్‌మెంట్‌తో ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: అరవింద్ శంకర్, ఫొటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై . లిమిటెడ్, కళ: రాజీవన్


Click it and Unblock the Notifications











