Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నితిన్ ది బయట పడింది
ప్లాపుల హీరో నితిన్ కి దశ బాగుంది. రామ్ గోపాల్ వర్మ అడివి సినిమా నుంచి ఎప్పుడో మూలన పడి మూలుగుతున్న 'సత్యం శివం సుందరం' సినిమా వరకు అన్ని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖ్ తన డైరెక్షన్ లో రూపొందించారు. అయితే తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. 2006 డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల తేదీని, థియేటర్లనూ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది. చిత్ర హీరోయిన్ మీరాచోప్రా తనకు నిర్మాత కొంత పారితోషికం బకాయి పడ్డాడంటూ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించడంతో సినిమా రిలీజ్ నిలిచిపోయింది.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రాజీ యత్నాలు కూడా ఫలించలేదు. కాని ఈ చిత్రం 'సాధు మిరిండ' పేరుతో తమిళనాట విడుదలై విజయంవంతమైంది. అయితే ఇన్నాళ్ళకు ఆ చిత్రానికి అన్ని అవరోధాలు తొలగిపోవడంతో నిర్మాత సినిమా రిలీజ్ కు సన్నాహాలు మొదలుపెట్టుతున్నారు. సెంటిమెంటల్ గా టైటిల్ కూడా 'మారో' అని మార్చారు. అలాగే దీనికి 'సైలెంట్..బట్ వయెలెంట్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉండబోతోంది. వీటితో పాటు ఇలియానాతో కలిసి నటిస్తున్న 'రెచ్చిపో' చిత్రం కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ మూడు చిత్రాలలో ఒక్కటైనా బ్రేక్ ఇవ్వక పోతుందా అని నితిన్ నమ్మకం. నితిన్, మీరాచోప్రా('బంగారం' ఫేమ్) జంటగా శ్రీనివాస రాజు 'సత్యం శివం సుందరం' చిత్రాన్ని నిర్మించారు.