బాలయ్య టైటిల్ తో నితిన్
నితిన్, హన్సిక కాంబినేషన్ లో ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో రానున్న చిత్రానికి సీతారామకళ్యాణం అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. అలాగే సీతారామకళ్యాణం అనే టైటిల్ ఇంతకు ముందు రెండు సార్లు వచ్చి విజయం సాధించింది. ఇంతకు ముందు బాలకృష్ణ హీరోగా సీతారామకళ్యాణం(1986) అనే టైటిల్ తో జంధ్యాల గారు ఓ చిత్రాన్ని రూపొందించారు. అంతకు ముందు ఎన్టీఆర్ హీరోగా ఇదే టైటిల్ తో 1961లో పౌరాణిక చిత్రం వచ్చింది.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎమ్మల్యే మళ్ళ విజయ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇక ఈశ్వరరెడ్డి ఇంతకు ముందు ఇదే నిర్మాతతో అల్లరి నరేష్ హీరోగా సిద్దు ప్రమ్ శ్రీకాకుళం చిత్రం రూపొందించారు. అలాగే నితిన్ హీరోగా రెండు వారాల క్రితం రెచ్చిపో చిత్రం విడుదలై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. హన్సిక విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రక్కన చేసిన జయీభవ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











