నితిన్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో మరోసారి...

By Srikanya

హైదరాబాద్: నితిన్, నిత్యా మీనన్ కాంబినేషన్ లో రూపొందిన ఇష్క్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత హిట్ కొట్టిన నితిన్ మరింత ఉత్సాహంతో వరస ప్రాజెక్టులను ఓకే చేస్తున్నారు. ఈ కోవలో తాజాగా విజయ్ అనే నూతన దర్శకుడు ప్రాజెక్టు ఓకే చేసారు. ఇష్క్ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నితిన్ సరసన నిత్యా మీనన్ నే ఎంపిక చేసారు. అలాగే ఇష్క్ తల్వార్ అనే కొత్త అమ్మాయిని కూడా ఈ చిత్రంకి ఎంపిక చేసారు.

ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రారంభం కానుందని నితిన్ తన ట్వీట్ లో తెలియచేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నితిన్ మాట్లాడుతూ.. నిత్యా మీనన్ తో మరోసారి కలిసిపనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఇష్క్ లో ఆమెతో కలిసి పనిచేయటం మెమరబుల్ ఎక్సపీరియన్స్. మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకునంటున్నాను అన్నారు.

ప్రస్తుతం నితిన్.. కొరియర్ బోయ్ కళ్యాణ్ చిత్రం చేస్తున్నారు. నితిన్ హీరోగా ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రారంభమైన చిత్రం 'కొరియర్‌బోయ్ కళ్యాణ్'. ప్రేమ్‌సాయి దర్శకత్వంలో గౌతమ్ వాసుదేవమీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. తమిళంలో 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం గూర్చి నిర్మాత గౌతమ్‌ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ నితిన్‌తో నిర్మిస్తున్న 'కొరియర్‌బోయ్ కళ్యాణ్' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో వుంటుందని, లవ్, యాక్షన్, కామెడీ సమపాళ్లతో వున్న ఈ చిత్రం భాషల కతీతంగా అందరికీ నచ్చుతుందని, కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని తెలిపారు. ముఖ్య పాత్రలో జై, సంతానం, వి.టి.వి గణేష్ నటిస్తుండగా మిగతా పాత్రల ఎంపిక జరగనుంది. రెగ్యులర్ షూటింగ్‌కి త్వరలోనే వెళ్లనున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నిర్మాత: గౌతమ్‌ వాసుదేవ మీనన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X