twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ పాటతో నితిన్ ‘గుండెజారి...’ (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యువ కథానాయకుడు నితిన్‌కు పవన్‌ కళ్యాణ్ అంటే ఎంతటి వీరాభిమానమో అందరికీ తెలిసిందే. తాజాగా నితిన్.. పవన్‌ కళ్యాణ్ లేటెస్ట్ హిట్ 'గబ్బర్‌ సింగ్' చిత్రంలోని ఓ పాటలోని లిరిక్ అయిన 'గుండె జారి గల్లంతయ్యిందే'ని టైటిల్‌గా పెట్టుకొని ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

    'ఇష్క్' చిత్రంలో తనతో జోడి కట్టిన నిత్య మీనన్‌తో నితిన్ మరోసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా, 'ఇష్క్'కు విజయవంతమైన పాటలను అందించిన అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

    తాజాగా 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. కిక్, ఊసరవెల్లి చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ''ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని 'దిల్ సే దిల్ సే' పాటలోని లిరిక్ ఇది. కథకు టైటిల్ బాగా యాప్ట్ అవుతుంది. దర్శకుడు, సినిమాటో గ్రాఫర్ మినహా 'ఇష్క' చిత్రానికి పని చేసిన టీం అంతా గుండె జారి గల్లంతయ్యిందే చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. ఇష్క్ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది' అన్నారు.

    ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఇషా తల్వార్, మధు నందన్, రఘుబాబు, తాగబోతు రమేష్, అలీ, ఆహుతి ప్రసాద్, సుధ, సంధ్యా జనక్ నటిస్తున్నారు. సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఆండ్రూ బాబు.ఐ, ఎడిటర్: ప్రవీన్ పూడి, లిరిక్స్: కృష్ణ చైతన్య, శ్రీమణి, ఆర్ట్స్ రాజీవ్ నాయర్, మాటలు-స్క్రీన్ ప్లే: హర్ష వర్ధన్, నిర్మాత: నిఖితా రెడ్డి, కథ-దర్శకత్వం: విజయ్ కుమార్ కొండ.

    పవన్ కళ్యాణ్ పాటతో నితిన్ ‘గుండెజారి...’(ఫోటో ఫీచర్)

    'గుండెజారి జారి గల్లంతయ్యిందే' చిత్రం లోగో ఆవిష్కరిస్తున్న సురేందర్ రెడ్డి.

    పవన్ కళ్యాణ్ పాటతో నితిన్ ‘గుండెజారి...’(ఫోటో ఫీచర్)

    సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఇష్క్ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పుడే సినిమా హిట్టవుతుందనిపించింది. ఈ చిత్రం కూడా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

    పవన్ కళ్యాణ్ పాటతో నితిన్ ‘గుండెజారి...’(ఫోటో ఫీచర్)

    ఇష్క్ టీంతో సురేందర్ రెడ్డి.

    పవన్ కళ్యాణ్ పాటతో నితిన్ ‘గుండెజారి...’(ఫోటో ఫీచర్)

    ఈ సినిమా నుంచి వచ్చే ట్యూన్లు ప్రేక్షకుల అంచనాకు తగ్గకుండా ఉంటాయంటున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.

    పవన్ కళ్యాణ్ పాటతో నితిన్ ‘గుండెజారి...’(ఫోటో ఫీచర్)

    నితిన్, నిత్యా మీనన్లతో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.

    English summary
    Nitin-Nithya Menon's upcoming movie "Gunde Jaari Gallanthayyinde" logo launched yesterday in Hyderabad. Director Surender Reddy attend as a chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X