నితిన్, నిత్యామీనన్ మధ్య మళ్లీ ఇష్క్
'ఇష్క్' చిత్రం ద్వారా కూల్ హిట్ కొట్టిన యువ హీరో నతిన్, మలయాళీ బ్యూటీ నిత్యా మీనన్ మరోసారి జతకట్టబోతున్నారు. 'ఫ్రెండ్ షిప్' ఫేం విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. 'ఇష్క్' చిత్రాన్ని రూపొందించిన ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 19న ప్రారంభం కానుంది.
సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం విజయ్ కుమార్ చెప్పిన కథ విని హీరో నితిన్ భాగా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత 'ఇష్క్' ద్వారా మళ్లీ తేరుకున్న నితిన్ చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు. తాజాగా విజయ్ చెప్పిన కథ తన కెరీర్‌కు ప్లస్సవుతుందని భావిస్తున్నాడట. అదే విధంగా నిత్యామీనన్‌కు, తనకు మధ్య స్క్రీన్ రొమాన్స్ బాగా వర్కౌట్ కావడంతో ఆమెనే హీరోయిన్‌గా ఓకే చేశాడు. మరి నిత్యా మీనన్‌తో నితిన్‌కు మరోసారి లక్కు కలిసొస్తుందో లేదో...
నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. పెద్ద స్టార్లు లేని ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రం ఇన్ని సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్య పరిచింది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్ నిర్మించిన ఇష్క్ చిత్రానికి పి.సి.శ్రీరామ్ కెమెరామెన్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. తాజాగా అదే బ్యానర్లో సినిమాకు కమిట్ అయిన నితిన్‌కు ఈ సినిమా ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











