హిట్ ఎఫెక్ట్ : రెమ్యూనరేషన్ పెంచేసిన నితిన్
హైదరాబాద్ : వరుసగా డజను ప్లాపు సినిమాల తర్వాత...'ఇష్క్' చిత్రంతో హిట్ కొట్టిన హీరో నితిన్ తాజాగా 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు నితిన్‌తో సినిమా అంటే పెద్దగా ఆసక్తి చూపని పలువురు దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు నితిన్ డేట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. దీంతో రెమ్యూనరేషన్ ప్రస్తుతం తీసుకుంటున్న దానికంటే రెట్టింపు చేసాడని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. గౌతం మీనన్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతం నితిన్ సరసన హీరోయిన్ గా ఎంపికయింది. కార్తీక్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు ప్రేమ్‌సాయి మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ సరికొత్త పాత్రలో నితిన్ నటిస్తున్న ఈ చిత్రం ఆయన గత చిత్రాల్లాగే విజయవంతమవుతుందని అన్నారు. సత్యం రాజేష్, హర్ష, జైసంతానం, వి.టి.వి.గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, ఎడిటింగ్: ఆంథోనీ, కెమెరా: ఓంప్రకాష్, నిర్మాత: గౌతం వాసుదేవమీనన్, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.
ఈ సినిమాల తర్వాత మరో రెండు ప్రాజెక్టులు నితిన్‌కు ఖరారయ్యాయి. అందులో కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో రూపొందబోయే సినిమా ఒకటి కాగా, మరొకటి అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాలు 2014లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.


Click it and Unblock the Notifications











