twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిసెంబర్లో నితిన్-కరుణాకరణ్ ‘చినదాన నీ కోసం’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న నితిన్ ఆ తర్వాత ‘హార్ట్ ఎటాక్' చిత్రంతో యూత్ ను మెప్పించాడు. దీని తర్వాత ‘తొలి ప్రేమ' ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో ‘చినదానా నీకోసం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో (12 లేదా 19) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నితిన్...ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా నితిన్ కు ఎంతో స్పెషల్. ఎప్పటినుంచో నితిన్ కరుణాకరన్ దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేని కరుణాకరన్‌కు ఈ చిత్రంతో ఎంతో కీలకం.

    Nitin's Chinadana Nee Kosam to release on December

    "అమృతం" ఫేం హర్షవర్థన్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

    English summary
    Nitin's upcoming movie Chinadana Nee Kosam's release date is out. The film is expected to hit theatres on December 19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X