'తొలిప్రేమ' లా: నితిన్ 'చిన్నదాన నీకోసం' ట్రైలర్(వీడియో)

By Srikanya

హైదరాబాద్ :ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు నితిన్. కెరీర్‌లో మంచి జోరుమీదున్న ఆయన తాజాగా మరో హిట్ పై కన్నేశారు. ఆయన ప్రస్తుతం కరుణాకరణ్ దర్శకత్వంలో చిన్నదాన నీకోసం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చాలా బాగుందంటూ అంతటా వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ మధ్య టీజింగ్ సీన్స్,ఫ్యామిలీ ఎమోషన్స్, హీరోయిన్ ని దేవతలా చూపటం చూస్తూంటే నితిన్ కి తొలిప్రేమ తరహా హిట్ ఇస్తున్నాడని అంటున్నారు. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ భామ మిస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇష్క్ చిత్రంలో ప్రజాదరణ పొందిన గీతంలోని చరణాన్ని టైటిల్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం కరుణాకరణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు.

Nitin's Chinnadana Nee Kosam Trailer

శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X